News October 12, 2024
కర్నూలు జిల్లాలో కిలో టమాటా @రూ.20
కర్నూలు జిల్లాలో ఇటీవల రూ.100 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. కాగా ఇటీవల టమాట ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడి కేంద్రాల్లో తక్కవ ధరలకే టమాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 10, 2025
కల్లూరు: ‘రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ భారం ఉండదు’
రాష్ట్ర ప్రజలపై 2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ భారం మరోసారి ఉండే అవకాశం లేదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, పీవీఆర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విద్యుత్ టారిఫ్ పెంపుపై నగరంలోని కల్లూరు ఏపీఈఆర్‌సీ భవన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో విజయవాడ నుంచి ఛైర్మన్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
News January 10, 2025
శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ
శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
News January 10, 2025
రేపు కర్నూలుకు పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 11:30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్కరం సాయంత్రం 4.50 గంటలకు తిరిగి విజయవాడకు వెళ్తారు.