News January 7, 2025
కర్నూలు జిల్లాలో నిందితుడి పరార్?
పోలీసుల అదుపులో నుంచి నిందితుడు పరారైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని పట్టణ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులకు మస్కా కొట్టి పరారైనట్లు సమాచారం. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సంబంధిత స్టేషన్ సిబ్బంది నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 9, 2025
నేడు కర్నూలు జిల్లాకు పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉ.11:45 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11:50 గంటలకు హెలికాఫ్టర్లో బయలుదేరి గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అప్పర్ రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
News January 9, 2025
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో విద్యార్థి ప్రతిభ
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో శ్రీ నవనంది పాఠశాల విద్యార్థి ప్రతిభ కనబరిచారు. నందికొట్కూరులోని నవనంది హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న ముర్తుజా వలి గత నెల 26 నుంచి 29వ తేదీ వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 55 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఛైర్మన్ శ్రీధర్ అభినందించారు.
News January 9, 2025
బసినేపల్లిలో రూ.1.50 లక్షల విలువైన వజ్రం లభ్యం
పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలోని బసినేపల్లిలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం లభ్యమైంది. గ్రామంలో వ్యవసాయ తోటలో పనులు చేస్తుండగా వజ్రం లభ్యం కావడంతో పెరవలికి చెందిన ఓ వ్యాపారికి రూ.1.50 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ప్రతి ఏడాది ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభ్యం కావడం సర్వసాధారణం. వ్యవసాయ కూలీకి వజ్రం లభించడంతో వారి ఇంట్లో ఆనందం నెలకొంది.