News April 22, 2025
కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీ కూతుళ్లు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి, కూతురు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనగా తండ్రీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆస్పిరి మండలం ముత్తుకూరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 23, 2025
కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News April 23, 2025
నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 23, 2025
ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 90 శాతం లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవల అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో కలెక్టర్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.