News December 23, 2024
కర్నూలు జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కర్నూలు జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్లో 80, పత్తికొండ డివిజన్లో 45 పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్జీలను డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని కోరారు.
Similar News
News December 23, 2024
PGRSకు 80 ఫిర్యాదులు: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. PGRS కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ASP యుగంధర్ బాబు పాల్గొన్నారు.
News December 23, 2024
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించండి: కలెక్టర్
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామ చేనేత స్టాల్‌ను ప్రారంభించి అధికారుల చేత చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. పేద స్థితిలో ఉన్న చేనేత సొసైటీలను ఆదరించి చేనేత ఉత్పత్తిదారులకు చేయూతను అందించాలని కలెక్టర్ తెలిపారు.
News December 23, 2024
ఫెయిల్ అయ్యానని.. ఆదోనిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఆదోనిలో సోమవారం విషాద ఘటన జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీకి చెందిన నవీన్ (20) అనే బీటెక్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ బీటెక్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీంతో తన గదిలో ఊరివేసుకున్నాడు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.