News September 19, 2024
కర్నూలు నుంచి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించండి: మంత్రి టీజీ భరత్
కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్‌కు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడకు ప్రతి రోజూ రైలు, కర్నూలు నుంచి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండు సార్లు రైలు సౌకర్యం కల్పించాలని కోరారు.
Similar News
News November 10, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలో రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్లు వీరే..!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీరికి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ అవార్డులు దక్కాయి. ☞ హెచ్.సత్యనారాయణ రావు (HM, జడ్పీ హై స్కూల్-వెలుగోడు)☞ డా.తొగట సురేశ్ (HM, డోన్)☞ ఎం.ఖాజా బేగ్ (SA-హిందీ, ZPHS ఎస్.బోయినపల్లి, వెల్దుర్తి మండలం)☞ కే.సత్యప్రకాశ్ (SGT, MPPS KASBA బనగానపల్లె)☞ బీ.నాన్సీ మేరీ (SA-సోషల్, ZPHS ఎర్రగుంట్ల, సిరివెళ్ల మండలం)☞ ML ప్రేమకాంత్ బాబు (SGT, MPUPS పుసులూరు, నంద్యాల మండలం)
News November 10, 2024
సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు రెండోసారి వరించిన పదవి
కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. 1982 నుంచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2016లో కుడా తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన సేవలను గుర్తించి రెండోసారి కుడా ఛైర్మన్‌గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2024
శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు త్వరలో కమిటీ
శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని CM చంద్రబాబు అన్నారు. ‘శ్రీశైలం సమీపంలో గుహలు, కొండలు ఉన్నాయి. సమీప కొండల వద్ద ట్రెక్కింగ్, ధ్యాన కేంద్రం ఉన్నాయి. శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్ రోడ్డును నిర్మించాం. త్వరలో శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మంత్రులు పవన్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం, దుర్గేశ్‌తో ఓ కమిటీ ఏర్పాటు చేస్తాం’ అని CM చంద్రబాబు స్పష్టం చేశారు.