News April 3, 2025
కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Similar News
News April 10, 2025
ఇక నుంచి మానవ డోనర్ మిల్క్: జిల్లా కలెక్టర్

చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్‌ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ ప్రారంభించారు.
News April 10, 2025
జగిత్యాల: కాంగ్రెస్ మీ ఇంట్లో పుడితే వేరే పార్టీకి ఎందుకు పోయావు: జీవన్

కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పుడితే బయట పార్టీలోకి ఎందుకు పోయారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పట్టణంలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమటోడ్చి అధికారంలోకి తీసుకువచ్చారని, బీఆర్ఎస్ దౌర్జన్యం తట్టుకోలేక యువకుడు సారంగాపూర్ అడవుల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
News April 10, 2025
మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయస్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఎప్పటిలాగే ఉంటాడు. ఆంజనేయ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి మా బిడ్డను కాపాడాడు. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నా తరఫున, పవన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని తెలిపారు.