News November 22, 2024

కర్నూలు పోలీసులకు మంత్రి లోకేశ్ అభినందన

image

కర్నూలులో ఇద్దరు పిల్లలకు రంగులు వేసి బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నారని మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్‌పై ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారిని రక్షించింది. దీనిపై తక్షణమే స్పందించిన కర్నూలు పోలీసులను మంత్రి లోకేశ్ అభినందించారు. ‘భవిష్యత్తులో పిల్లలపై ఇలాంటి వేధింపులు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ‘X’లో ఆదేశించారు.

Similar News

News November 23, 2024

నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

శ్రీశైల క్షేత్రంలో మళ్లికార్జున స్వామి స్పర్శదర్శనం శని, ఆది, సోమవారాల్లో నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఈ మూడు రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు చెప్పారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

News November 23, 2024

రోజా పూల తోటను పరిశీలించిన కలెక్టర్

image

మహానంది మండలం గాజులపల్లెలో రోజా పూల తోటను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు. సాగు చేస్తున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. పూల తోట చక్కగా ఉందని రైతును ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించి ఆర్థిక ప్రయోజనం పొందాలని కోరారు.

News November 22, 2024

నంద్యాల: మహిళా MLAల గ్రూప్ SELFIE

image

అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మ‌హిళా MLAలు కేక్ క‌ట్ చేసి ప్ర‌శాంతిరెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు. వేడుక‌ల అనంత‌రం హోంమంత్రి అనిత‌ అంద‌రినీ త‌న ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మన MLAలు భూమా అఖిలప్రియ, గౌరు చరితా పాల్గొన్నారు.