News December 28, 2024

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

కడప మహిళకు కర్నూలులో వైద్యులు అరుదైన ఆపరేషన్ పూర్తి చేశారు. కడపకు చెందిన రమణమ్మ గత కొన్నినెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు కిడ్నీ, లివర్‌కు దగ్గరలో రక్తనాళాలు ఆనుకొని 8.సెం.మీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కర్నూలుకు రెఫర్ చేయగా.. యురాలజీ HOD డా. కే. సీతారామయ్య బృందంతో మూడు గంటల పాటు శ్రమించి కణితిని తొలగించినట్లు తెలిపారు. ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News December 29, 2024

కోనేరు హంపీకి అభినందనలు: నంద్యాల MP శబరి

image

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం కోనేరు హంపీ రికార్డ్ సృష్టించారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖేందర్‌పై ఆమె విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అభినందనలు తెలిపారు. ‘2024 FIDE మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నందుకు కోనేరు హంపీకి అభినందనలు. మీ విజయం కృషికి, దృఢత్వానికి, నిజమైన ఛాంపియన్ స్ఫూర్తికి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

News December 29, 2024

ఆత్మరక్షణ విద్యగా తైక్వాండో సాధన చేయాలి: టీజీ వెంకటేశ్

image

ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ విద్యగా టైక్వాండో సాధన ప్రతిరోజు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరం సాధన చేస్తే క్రమశిక్షణతో పాటు శారీరక అభివృద్ధి కలుగుతుందన్నారు.

News December 29, 2024

8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం

image

8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు కర్నూలు బీ.క్యాంపులోని టీజీవీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ పైట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, ప్రభాకర్‌ హాజరై పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రాలలో అనేక జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పోటీల కార్యదర్శి అబ్దుల్లా పాల్గొన్నారు.