News November 19, 2024

కర్నూలు: ‘రూ.100 కోసం ప్రాణం తీశాడు’

image

రూ.100 కోసం వ్యక్తిని చంపిన ఘటన కర్నూలులో సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. మమతానగర్‌‌కు చెందిన కృపానందం(27), రోజావీధికి చెందిన అజీజ్‌ ఇద్దరూ కల్లు తాగేచోట ఫ్రెండ్స్ అయ్యారు. సోమవారం కల్లు తాగి సంకల్‌బాగ్‌లోని ఓస్కూలు వద్ద బొమ్మ, బొరుసు ఆట ఆడారు. కృపానందం రూ.100 గెలుచుకోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అజీజ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కృపానందం తలపై అజీజ్ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Similar News

News November 24, 2024

కర్నూలు: కన్నీరు పెట్టిస్తున్న వెల్లుల్లి ధరలు

image

కర్నూలు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 -.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి

News November 24, 2024

నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ

image

నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.