News March 31, 2025
కర్నూలు: రూ.71.47 కోట్ల పన్నులు వసూలు

నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే కర్నూలు నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. స్పందించిన బకాయిదారులు అత్యధిక సంఖ్యలో పన్నులు చెల్లించినందుకు నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయేలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు కేఎంసీ కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.71.47 కోట్లు పన్ను రూపంలో వసూలు అయినట్లు తెలిపారు.
Similar News
News April 3, 2025
సుంకేసుల డ్యామ్ ఘటన.. మృతులు వీరే!

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 3, 2025
కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులపై చర్చ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని భరత్ తెలిపారు.
News April 3, 2025
కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు – విజయవాడ విమాన సౌకర్యంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని టి.జి భరత్ పేర్కొన్నారు.