News July 11, 2024

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్

image

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఐజీగా ఉన్న సీహెచ్ విజయరావును తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు విజయవాడలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 14, 2025

వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు

image

కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన <<15745116>>వైసీపీ<<>> నాయకుడు సోముల లోకేశ్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో అదే గ్రామానికి చెందిన 9మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. గ్రామానికి చెందిన సూర చిన్న సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సురేశ్ కుమార్ రెడ్డి, రవి కుమార్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మోహన్, ఆర్.చిన్న సుబ్బారెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు.

News March 14, 2025

నంద్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష

image

హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి రాధారాణి తీర్పు చెప్పారు. తమ్మరాజుపల్లె గ్రామంలో 2017లో శివమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. తన అక్రమ సంబంధం తెలిసిందనే కారణంతో కోడలు ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది.

News March 14, 2025

బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన Way2News

image

కర్నూలు జిల్లా గోనెగండ్లలోని గంజల్ల రోడ్డు సమీపంలో 3ఏళ్ల <<15748871>>బాలుడు<<>> సంచరిస్తుండగా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ బాలుడిని గోనెగండ్ల పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బాలుడి సంబంధీకులు తమన సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని Way2News ప్రచురించింది. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలుడిని తీసుకువెళ్లారు. తమ బిడ్డ ఆచూకీకి సహకరించిన Way2Newsకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!