News April 7, 2025
కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: కర్నూలు ఎంపీ

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒకరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
Similar News
News April 13, 2025
క్యాన్సర్‌ను జయిస్తూ 420 మార్కులతో ప్రతిభ

బ్లడ్ క్యాన్సర్ బారిన పడి కోలుకుంటున్న కర్నూలు జిల్లా విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. గోనెగండ్లకు చెందిన సృజనామృత బైపీసీలో 440కు గానూ 420 మార్కులతో ప్రతిభ చూపారు. కర్నూలులోని ఓ కళాశాలలో చదువుతన్న బాలిక క్యాన్సర్‌ను జయిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించండంపై అధ్యాపకులు అభినందించారు. తండ్రి ఉరుకుందు గౌడ్ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని బాలిక తెలిపారు.
News April 13, 2025
హఫీజ్ ఖాన్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.
News April 13, 2025
రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఆదర్శ రైతు కారుమంచి షేక్ అహ్మద్ కుమారుడు షేక్ ఆసిఫ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. బైపీసీలో 440/430 మార్కులు సాధించి టాప్-10లో చోటుసాధించారు. విద్యార్థిని లెక్చరర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఆసిఫ్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య విద్య పూర్తి చేసి గ్రామస్థులకు సేవలందిస్తానని చెప్పారు.