News December 24, 2024

కర్నూలులో పతనమైన ఎండు మిర్చి ధర

image

కర్నూలు మార్కెట్‌లో ఎండు మిర్చి ధరలు భారీగా పడిపోయాయి. సోమవారం క్వింటా గరిష్ఠ ధర రూ.14,913 పలికింది. సరాసరి రూ.11,119, కనిష్ఠ ధర రూ.1,599తో విక్రయాలు సాగాయి. నెల క్రితం క్వింటా రూ.20 వేలు పలకగా ప్రస్తుతం భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న రూ.2,052, కందులు గరిష్ఠ ధర రూ.7,449లు పలికాయి. ఉల్లి క్వింటా గరిష్ఠ ధర రూ.3,200, సజ్జలు గరిష్ఠ ధర రూ.2,403లతో అమ్ముడయ్యాయి.

Similar News

News December 25, 2024

హిజ్రాతో కుమారుడి ప్రేమ.. నంద్యాలలో తల్లిదండ్రుల ఆత్మహత్య

image

హిజ్రాతో కుమారుడి ప్రేమ దంపతుల ప్రాణం తీసింది. నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన సరస్వతి, సుబ్బరాయుడుల కుమారుడు సునీల్ ఆటో నడుపుతూ ఓ హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడిని బంధువుల ఇంటికి పంపారు. అప్పటి నుంచి హిజ్రాలు సుబ్బరాయుడు దంపతులను వేధింపులకు గురిచేస్తున్నారు. కుమారుడూ హిజ్రానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపం చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందారు.

News December 25, 2024

నంద్యాల: చనిపోతున్నా అంటూ ఫోన్.. కాపాడిన పోలీసులు

image

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కృష్ణాపురంలో శివకుమార్ అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ ఆదేశాల మేరకు అతడి ఫోన్ సిగ్నల్ లొకేషన్‌ను గుర్తించి పోలీసులు ఆయన్ని ఆత్మకూరు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.

News December 25, 2024

కోడుమూరులో టీచర్‌పై పోక్సో కేసు

image

కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రైవేట్ టీచర్ భాస్కర్ ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఆయన కోడుమూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.