News March 22, 2025
కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
☞ ఉదయ 9.45 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు
☞ 9.50 గంటలకు రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో నీటి కుంటల తవ్వకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు
☞ 11.40 గంటలకు తిరిగి విమానాశ్రయం చేసుకుని బేగంపేట వెళ్తారు.
Similar News
News March 25, 2025
బ్యూటిఫుల్ కపుల్.. 64 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!

హర్ష్, మృణు అనే జంట 1960లో పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి మతాలు వేరవడంతో అప్పట్లో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయితే అప్పుడు అనాథలుగా పెళ్లి చేసుకున్న వీరికి ఇప్పుడు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించాలని పిల్లలు, మనవళ్లు నిర్ణయించారు. 64 ఏళ్ల తర్వాత వీరికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి ఫొటోలు వైరలవుతున్నాయి. చూడ ముచ్చటైన జంట అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News March 25, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తపల్లి-ధర్మారం 37.7°C నమోదు కాగా, తాంగుల, ఈదులగట్టేపల్లి, బురుగుపల్లి, ఇందుర్తి 37.6, జమ్మికుంట, మల్యాల 37.5°C, నుస్తులాపూర్ 37.3, కరీంనగర్ 37.1, వీణవంక, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 36.9, గంగిపల్లి 36.8, తాడికల్ 36.5, బోర్నపల్లి 36.1, దుర్శేడ్, చింతకుంట, గుండి 36.0°C గా నమోదైంది.
News March 25, 2025
ఖమ్మం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాచేపల్లికి చెందిన D.హరీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 రోజులుగా ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.