News November 25, 2024
కర్నూలులో భర్తను హత్య చేసిన భార్య
భర్తను భార్య చంపిన ఘటన ఆదివారం కర్నూలులో జరిగింది. కర్నూలు తాలూకా సీఐ శ్రీధర్ మాట్లాడుతూ.. టీవీ9 కాలనీకి చెందిన కరగల్ల చిన్న(25), తన భార్య స్వరూపారాణి రోజూ గొడవపడేవారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహించిన భార్య ఇనుప రాడ్డుతో భర్త తలపై కొట్టింది. బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.
Similar News
News November 25, 2024
టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 10 వేల మందికి ఉపాధి: మంత్రి
ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 5 వేల నుంచి 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి కల నెరవేరబోతోందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.
News November 25, 2024
ఏపీ సీఎస్ఐఈసీ జాయింట్ సెక్రటరీగా కలెక్టర్
ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాయింట్ సెక్రటరీగా కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో కమిటీ జాయింట్ సెక్రటరీగా రంజిత్ బాషా ఎన్నికయ్యారు.
News November 25, 2024
అందరూ సమన్వయంతో పని చేయండి: అడిషనల్ ఎస్పీ
కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరిగే లోక్ ఆదాలత్‌లో అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. న్యాయశాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.