News February 24, 2025
కర్లపాలెం: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం సమీపంలో కొత్త నందాయపాలెంకి చెందిన రైతు సుబ్బారెడ్డి మిర్చి పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో బోరు స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 25, 2025
ADB: మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించినట్లు సంస్థ రీజినల్ మేనేజర్ సోలోమన్ తెలిపారు. రీజినల్ పరిధిలోని నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27వ వరకు వేములవాడ, వేలాల, బుగ్గ, నంబాల, వాంకిడి, ఈజ్గాంకు 93 బస్సులను 833 ట్రిప్పుల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
News February 25, 2025
ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్‌లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.
News February 25, 2025
కామారెడ్డి: 100% ఉత్తీర్ణత సాధించాలనేదే లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ రివ్యూ సమావేశంలో మాట్లాడారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఫలితాలు మెరుగుపరచాలన్నారు. విద్యార్థులను విభాగాలుగా విభజించి, దత్తత తీసుకుని ఫలితాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు.