News April 6, 2025
కలిదిండి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 3న మద్యం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. మద్యం మానేయాలని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై 4వ తేదీన ఎలుకల మందుని నీళ్లలో కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News April 9, 2025
పంచాయతీ కార్యదర్శి ఆస్తి రూ.85 కోట్లు!

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ EOగా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి ACB అధికారులే షాక్ అయ్యారు. గత FEBలో అతడు రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తాజాగా తిరుపతి పేరూరులోని మహేశ్వరయ్య ఇంట్లో ACB సోదాలు జరిపింది. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
News April 9, 2025
ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్.. హీరోయిన్ ఫైర్

తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్ వచ్చిందంటూ హిమాచల్ ప్రభుత్వంపై హీరోయిన్, BJP MP కంగనా రనౌత్ మండిపడ్డారు. ‘మనాలిలో ఉన్న నా ఇంటికి ఈ నెలలో రూ.లక్ష కరెంట్ బిల్ వచ్చింది. అసలు నేను ఆ ఇంట్లోనే ఉండటం లేదు. అలాంటప్పుడు ఇంత బిల్ ఎలా వస్తుంది? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ సర్కార్ సిగ్గుపడాలి. దీనిపై అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు.
News April 9, 2025
కోటబొమ్మాళి: ‘పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టండి’

పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదాను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళిలో పర్యాటక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్ ఆధునీకరించాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.