News April 6, 2025
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారాలకు చేస్తామన్నారు.
Similar News
News April 17, 2025
కృష్ణా: ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పుడంటే.!

దీపం 2 పథకంలో భాగంగా 2025-26లో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు దరఖాస్తు చేయాలని జేసీ గీతాంజలి శర్మ తెలిపారు. ఈ ఏడాది మూడు విడతల్లో సిలిండర్‌లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్-జులైలో మొదటిది, ఆగస్టు-నవంబర్‌లో రెండోది, డిసెంబర్-మార్చిలో మూడోది ఉచితంగా అందించనున్నారు. గతేడాది 3,60,500 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 59,333 పంపిణీ చేశారు.
News April 17, 2025
గాజువాక యువకుడిని కాపాడిన పోలీసులు

గాజువాకకు చెందిన సన్యాసినాయుడు రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సన్యాసినాయుడు రాజమండ్రిలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నాడు. కాగా బెట్టింగులకు బానిసై రూ.50వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బుధవారం రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో దూకాడు. అది గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని కాపాడారు.
News April 17, 2025
అల్లూరి జిల్లాలో ఇంటర్ మెమోలు విడుదల

ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఇంటర్ మార్క్స్ మెమోలు ప్రభుత్వం విడుదల చేసిందని అల్లూరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి అప్పలరాం గురువారం తెలిపారు. హాల్ టికెట్ నంబర్ , పుట్టిన తేదీ నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. https://bie.ap.gov.in/ShortMemos వెబ్ సైట్లో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.