News April 5, 2025

కల్వకుర్తి: WOW.. విత్తనాల ముగ్గు చూశారా..!

image

కల్వకుర్తి పరిధి కడ్తాల్ మండలం అస్మాన్‌పల్లిలో శుక్రవారం విత్తనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విత్తనాలతో వేసిన ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. దేశంలోని నలుమూలల నుంచి వ్యవసాయ సంబంధిత శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతులు పాల్గొన్నారు. వేలాది విత్తనాలతో మొత్తం 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు.

Similar News

News April 5, 2025

రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

image

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 5, 2025

‘ఎంపురాన్’ డైరెక్టర్‌‌కు ఐటీ నోటీసులు

image

మోహన్‌లాల్ నటించిన L2 ఎంపురాన్ డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2022లో ఆయన నటించి, సహ నిర్మాతగా వ్యహరించిన 3 సినిమాల వల్ల పొందిన ఆదాయ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈనెల 29 వరకు సుకుమారన్‌కు గడువు విధించింది. కాగా 2022లోనూ పృథ్వీరాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మరోవైపు నిన్న ఎంపురాన్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది.

News April 5, 2025

BRS రజతోత్సవ సభ.. పాలమూరు నేతలతో KCR MEETING

image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!