News March 23, 2025
కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.
Similar News
News March 26, 2025
ములుగు: పిల్లల పాలిట శాపంగా ‘బోనోఫిక్స్’ మత్తు!

ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బోనోఫిక్స్ మత్తు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి మత్తు పదార్థాల గురించి వింటూనే ఉంటాం. కానీ విద్యార్థులు, పిల్లలు బోనోఫిక్స్ అనే మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నారు. పోలీసులు నిఘాతో దాడులు చేస్తున్న బోనోఫిక్స్ అమ్మకాలు ఆగడం లేదు. కొందరు షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా బోనోఫిక్స్ అమ్ముతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
News March 26, 2025
పత్తికొండ వాసి రామ్మోహన్‌కు సేవా పురస్కారం

పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.
News March 26, 2025
రాష్ట్రవ్యాప్తంగా ULBల్లో ఓటీఎస్ అమలు

TG: జీహెచ్ఎంసీతో సహా అర్బన్ లోకల్ బాడీ(ULB)ల్లో ఆస్తి పన్నుపై వడ్డీ చెల్లింపునకు ‘వన్ టైం సెటిల్‌మెంట్(OTS)’ పథకాన్ని పురపాలక మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీలపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.