News February 7, 2025
కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు: JC
అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జేసీ నిషాంతి తెలిపారు. శుక్రవారం కళ్యాణ వేదిక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు, మినీ కంట్రోల్ రూమ్, బీచ్ పాయింట్, స్నాన ఘట్టాలు ఆమె పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 12.55 గంటలకు కళ్యాణం జరుగుతుందన్నారు. నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని చెప్పారు.
Similar News
News February 7, 2025
SHOCKING: ఆన్‌లైన్‌లో ‘తండేల్’ మూవీ
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీని పైరసీ వెంటాడింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే ఆన్‌లైన్ HD ప్రింట్ అందుబాటులోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇది చాలా బాధాకరమని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడాలంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి.
News February 7, 2025
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వినూత్న ఆలోచన
నెల్లూరు పరిధిలో చెత్త సేకరణ వాహనాలకే వ్యర్థాలను అందించాలని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేస్తున్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ వినూత్నంగా ఆలోచించారు. వ్యర్థాలు వేస్తున్న ఆ ప్రదేశాన్ని పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయించారు. రంగు రంగుల ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు.
News February 7, 2025
తిరుపతి: బీటెక్ ఫలితాల విడుదల
తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్‌లో బీటెక్ CSE, EEE, ECE, MEC చివరి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను www.spmvv.ac.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.