News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
బెల్లంపల్లి: అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ రైల్వే లైనులో మధ్యలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. వివరాల ప్రకారం..బుధవారం ఉదయం రైల్వే లైన్ల మధ్యలో మృతదేహం ఉన్నట్లు రైల్వే డ్రైవర్ సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ ఘటనాస్థలానికి చేరుకొని పరీక్షించారు. యువకుడు చంద్రవెల్లి గ్రామానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ నరేష్(24)గా గుర్తించారు.
News February 5, 2025
సంగారెడ్డి: అర్ధరాత్రి అరెస్టుల దుమారం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలంలో అర్ధరాత్రి అరెస్టుల దుమారం నెలకొంది. స్థానిక నల్లవల్లి అటవీ ఫారెస్టులో నూతనంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోని మండల పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు బీఆర్ఎస్ నాయకులు, గోవర్దన్ రెడ్డి, కుమార్ గౌడ్ మంగళవారం రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉలిక్కిపడిన ప్యారా నగర్, నల్లవల్లి గ్రామస్థులు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
News February 5, 2025
కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి
గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.