News April 6, 2025

కశింకోట: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

image

కశింకోట మండలం నర్సింగబిల్లిలో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పి.బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 9, 2025

కృష్ణా: మండలానికి 3 లేదా 4 ఆదర్శ పాఠశాలలు- కలెక్టర్

image

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణపై ఆయన సమీక్షించారు. మండలానికి కనీసం 3 లేదా 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

News April 9, 2025

సిరిసిల్ల: ఆయుధ కారాగారాన్ని ప్రారంభించిన అడిషనల్ డీజీపీ

image

సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులో 17th బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన ఆయుధ కారాగారాన్ని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ కలిగిన ఆర్గనైజేషన్ అని తెలిపారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.

News April 9, 2025

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: సూర్యాపేట కలెక్టర్

image

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో వైద్య అధికారులు, టీఎస్ ఎమ్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. 

error: Content is protected !!