News April 5, 2025
కశింకోట: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగిబిల్లి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని పిల్లి బోయిన బ్యూలా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
SKLM జిల్లాలో 6,508 కేసులు పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6,508 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా శనివారం పేర్కొన్నారు. దీనిలో సివిల్ కేసులు 202కు రూ.4,54,96,124లు, క్రిమినల్ కేసులు 625కు రూ.52,54,522లు, ఫ్రీ లిటిగేషన్ కేసులు 53కు రూ.20,38,931లతో రాజీ అయ్యాయని వెల్లడించారు. HMPO కేసులలో భార్యాభర్త కలుసుకోవడంతో న్యాయమూర్తులు ఆనందం వ్యక్తం చేశారన్నారు.
News December 13, 2025
Nobel Prize: వేషం మార్చి, పడవల్లో వెళ్లి..

నోబెల్ అందుకునేందుకు వెనిజుల ప్రతిపక్ష నేత మరియా మచాడో పెద్ద సాహసమే చేశారు. బయట కనపడితే అరెస్ట్ చేద్దామనుకున్న ప్రభుత్వ కళ్లు గప్పి 3 రోజులు కష్టపడి నార్వేకు చేరుకున్నారు. US సైనిక నిపుణులు ‘ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్’ చేపట్టి మచాడో వేషం మార్చి, పడవల్లో తీసుకెళ్లారు. డిజిటల్ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. అయినా ఆలస్యం కావడంతో ఆమె కుమార్తె నోబెల్ పురస్కారాన్ని స్వీకరించారు.
News December 13, 2025
సూర్యాపేట: ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: ఎస్పీ

రెండో విడత మండల ఎన్నికల విధులకు సంబంధించి చివ్వెంలలోని వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో పోలీసు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించారు. ఎస్పీ నర్సింహా హాజరై మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.


