News March 23, 2024
కసింకోట: ఏలేరు కాలువలో పడి యువకుడి మృతి
తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట సమీపంలోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై దొర తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన బుద్ధన పవన్ కుమార్ (19) పెంపుడు కుక్క, స్నేహితుడితో కలిసి ఏలేరు కాలువ గట్టు వైపు వెళ్తుండగా కుక్క పరిగెత్తడంతో దాన్ని పట్టుకునే క్రమంలో నీటిలో పడిపోయాడు. స్థానికులు నీటిలో దూకి బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు.
Similar News
News January 10, 2025
విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లు
విశాఖ- సికింద్రాబాద్ (20833/34)వందే భారత్ రైలుకు అదనంగా నాలుగు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. జనవరి 11 నుంచి వందే భారత్ రైలు 20 కోచ్‌లతో నడుస్తుందన్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ -2, చైర్ కార్ -18 బోగీలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News January 10, 2025
అరకు: ‘గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా చలి అరకు ఉత్సవం’
గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా చలి అరకు ఉత్సవం నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. చలి అరకు ఉత్సవంపై గురువారం సమావేశమయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనకు అవసరమైన కళాకారుల వివరాలు సేకరించి రవాణా, వసతి సౌకర్యాలు సమకూర్చాలని చెప్పారు. ప్రతీ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించారు. ఫుడ్ కోర్టులు, ఎమ్యూజ్మెంట్, పార్కింగ్, స్టాల్స్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
News January 9, 2025
టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే: గుడివాడ
తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ వైసీపీ ఆఫీసులో గురువారం మాట్లాడారు. టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే అన్నారు. అధికార యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించామని గుర్తు చేశారు.