News March 20, 2024
కాంగ్రెస్ MP అభ్యర్థి రేసులో మద్దూరు సుబ్బారెడ్డి మనవడు..?

నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి మనవడు మద్దూరు హరి సర్వోత్తమరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల అయన PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్గా, మంత్రిగా,
ఎమ్మెల్సీగా, నంద్యాల కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన మద్దూరు సుబ్బారెడ్డి సేవలు ఆయన మనవడికి కలిసొస్తుందని భావిస్తున్నారు.
Similar News
News April 3, 2025
కొత్త జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.

నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.