News April 3, 2024
కాంగ్రెస్ అసమర్ధతతో రాష్ట్రంలో కరువు: డీకే అరుణ
కాంగ్రెస్ అసమర్ధత పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్భాటాలకు పోయి ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు గుర్తించాలన్నారు. ఓటుతో బుద్ది చెప్పాలి, లేకపోతే మరోసారి మోసపోతారని అన్నారు.
Similar News
News December 25, 2024
MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
News December 24, 2024
MBNR: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వినతి
మహబూబ్‌నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఒబేదుల కోత్వాల్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 24, 2024
MBNR: ఇంటర్ విద్య బలోపేతంపై దృష్టి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఫీల్డ్ ఆఫీసరుగా డీడీ. లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్దిష్ట పరిశీలన, సూచనలతో కూడిన నివేదికను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.