News April 24, 2025
కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు: జగదీశ్ రెడ్డి

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘ఇది బీఆర్‌ఎస్ సభనా, లేక టీఆర్‌ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్‌రెడీ బీఆర్‌ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
NLG: ప్రభుత్వ కాలేజీల్లో తగ్గుతున్న ఫలితాలు

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో 12 జూనియర్ కళాశాలలు ఉండగా నాంపల్లి 85.71, చింతపల్లి 76.92, హిల్ కాలనీ 66.91, దేవరకొండ (బాలికలు) 58.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన కాలేజీల్లో 50 శాతం లోపే ఉత్తీర్ణత రాగా, అతి తక్కువగా నకిరేకల్ కళాశాలలో 26.8 శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాలు తగ్గడానికి విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోవడమే కారణమని అధ్యాపకులు భావిస్తున్నారు.
News April 24, 2025
NLG: టీపీసీసీ పరిశీలకుల నియామకం!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా..? లేక కొత్తవారిని నియమించాలా..? అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.
News April 24, 2025
NLG: రజతోత్సవం పైనే బీఆర్ఎస్ నజర్

వరంగల్ సభను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని తరలించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల నుంచి 12,500 మంది చొప్పున 50 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.