News April 1, 2025

కాకాణి నేడు విచారణకు హాజరవుతారా?

image

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పలు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఆయనకు నోటీసులు అంద‌జేసేందుకు పోలీసులు పొద‌ల‌కూరు, హైదరాబాదుకు వెళ్లినా అందుబాటులో లేరు.ఇవాళ ఉ.11గంటలకు నెల్లూరు DSP ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా APR 18కి విచారణ వాయిదా పడింది. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

Similar News

News April 3, 2025

గూడూరులో ఎంటెక్ విద్యార్థి మృతి

image

గూడూరులో ఓ ఎంటెక్ విద్యార్థి చనిపోయాడు. స్థానికంగా ఉన్న ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జశ్వంత్ ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో కాలేజీ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి అతను దూకేశాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News April 3, 2025

NLR: గుంతలో పడి మృతి.. భారీ ఫైన్ వేసిన కోర్టు

image

అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయిన టీచర్ కుటుంబానికి భారీ పరిహారం అందింది. విడవలూరు(M) రామతీర్థం స్కూల్ పీఈటీ దాసరి కామరాజ్ 2016 మే27న బైకుపై నెల్లూరుకు వెళ్లాడు. తిరిగొస్తుండగా గుండాలమ్మపాలెం వద్ద గుంతలో పడి చనిపోయారు. అక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతో చనిపోయారని బంధువులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కామరాజ్‌కు ఇంకా 12ఏళ్ల సర్వీస్ ఉండటంతో రూ.1.30కోట్లు చెల్లించాలని R&B శాఖను కోర్టు ఆదేశించింది.

News April 3, 2025

నెల్లూరు: అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

image

ఆర్మీలో చేరాలనుకుంటున్న నెల్లూరు యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 అగ్ని వీర్ రిక్రూట్మెంట్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. ట్రైనింగ్‌తో పాటు నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీలోపు www.joinindainarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. యువకులతో పాటు మహిళలు సైతం అప్లై చేసుకోవచ్చు.

error: Content is protected !!