News April 25, 2024
కాకినాడ: MLA బరిలో తాత, మనవరాలు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కూటమి నుంచి వరుపుల సత్యప్రభ పొటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బరావు బరిలో ఉన్నారు. అయితే రాజకీయంగా వీరు ప్రత్యర్థులు అయినప్పటికీ వరుసకు వీరు తాత, మనవరాలు.
Similar News
News April 21, 2025
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా, డివిజన్ మండల, మున్సిపల్ క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు.
News April 21, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్ అలాగే డివిజన్, మునిసిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు ప్రజల నుంచి పిజిఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు
News April 20, 2025
రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.