News March 4, 2025
కాకినాడ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. BA పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
Similar News
News March 4, 2025
వింత సమస్యతో బాధపడుతున్న హీరోయిన్!

మంచి గుర్తింపు తెచ్చుకున్న పాతతరం హీరోయిన్లలో లైలా ఒకరు. ఇటీవల తనకున్న వింత సమస్య గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ భామ. తాను నవ్వకుండా ఉండలేనని, నవ్వు ఆపేస్తే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయన్నారు. శివపుత్రుడు షూటింగ్ సందర్భంగా విక్రమ్ ఓ నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని ఛాలెంజ్ విసరగా, 30సెకన్లకే ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. దీంతో మేకప్ అంతా పాడైపోయిందని వివరించారు.
News March 4, 2025
యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.
News March 4, 2025
దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్ష రాసిన విద్యార్థి

తమిళనాడులో సునీల్ అనే విద్యార్థి తన తల్లి మరణంలోనూ తన కర్తవ్యాన్ని వీడలేదు. సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించింది. అదే రోజు ఇంటర్ పరీక్షలు మెుదలు. నీ భవిష్యత్తే తల్లి కోరుకునేదని, పరీక్ష రాయాలని బంధువులు ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్ష రాసాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.