News March 4, 2025
కాకినాడ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. BA పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
Similar News
News March 5, 2025
మార్చి 5: చరిత్రలో ఈరోజు

1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
1917: సినీ నటి కాంచనమాల జననం
1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం
1958: సినీ నటుడు నాజర్ జననం
1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం
1985: నటి వరలక్ష్మి శరత్ కుమార్ జననం
1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం
2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం
News March 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 5, 2025
భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.