News February 12, 2025

కాకినాడ జిల్లా వాసులకు ALERT

image

కాకినాడ జిల్లా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి మండలానికి రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పశువర్ధక శాఖ ప్రకటించింది. మంగళవారం మొత్తం 42 బృందాలు జిల్లా వ్యాప్తంగా పరిశీలించాయి. 82 ఫారాలలో 62 లక్షల కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడైనా కోళ్ల మరణాలు జరిగితే వెంటనే అధికారులు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.

Similar News

News December 14, 2025

లోక్యతండా సర్పంచ్‌గా మౌనిక

image

రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. నర్మెట్ట మండలంలోని లోక్యాతండాలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి మౌనిక 41 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 8 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాగా ప్రజలు ప్రజాస్వామ్య పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

News December 14, 2025

ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: విశాఖ కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో డిసెంబర్ 15న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 14, 2025

హనుమాన్ చాలీసా భావం – 38

image

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>