News February 13, 2025

కాకినాడ: జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజా

image

మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. జిల్లాకు చెందిన ఇద్దరి కాపు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించింది. 

Similar News

News February 13, 2025

మేడ్చల్: DEO, MEO మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు

image

మేడ్చల్ జిల్లాలో విద్యాధికారులు ఉన్నారా అని SFI మేడ్చల్ జిల్లా కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు. పట్టణంలోని క్రిక్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని ఫీజు కట్టలేదని ఇంటికి పంపని ఘటన మరువకముందే, శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజుల వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన మేడ్చల్ డీఈఓ, ఎంఈఓ మిస్సింగ్ అయ్యారని SFI నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 13, 2025

HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.

News February 13, 2025

పోలీసుల నోటీసులపై పోచంపల్లి రియాక్షన్

image

TG: <<15447380>>పోలీసుల నోటీసులపై<<>> MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌజ్ తనదేనని, రమేశ్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఫామ్ హౌస్ వెళ్లి ఎనిమిదేళ్లు దాటినట్లు చెప్పారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు. కాగా కోడి పందేలు జరిగాయని గేమింగ్, యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!