News March 12, 2025

కాకినాడ జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా వీరపాండియన్‌ను కాకినాడ జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News March 12, 2025

బీసీ స్టడీ సర్కిల్‌లో ఫ్రీ కోచింగ్.. అప్లై ఇలా

image

TG: BC స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిగ్రీ పాసై 26yrsలోపు వయసున్న బీసీలు అర్హులు. మార్చి 15- ఏప్రిల్ 8 వరకు https://studycircle.cgg.gov.in/లో అప్లై చేయాలి. APR 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ప్రైవేట్ బ్యాంక్‌లలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఫోన్: 040-29303130.

News March 12, 2025

VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ అద‌న‌పు స‌హాయం

image

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న -గ్రామీణ్‌, అర్బ‌న్, పీఎం జ‌న్‌మ‌న్‌ ప‌థ‌కాల కింద గ‌తంలో మంజూరై నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించింద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ వెల్ల‌డించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అద‌నంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని అందిస్తుందన్నారు.

News March 12, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం: లోకేశ్

image

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తిరిగి తీసుకొస్తామన్నారు. అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న ఘటనలను ఒప్పుకునేది లేదన్నారు. ఏ కాలేజీ అయినా ఫీజులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచించారు.

error: Content is protected !!