News April 6, 2024

కాకినాడ: నడిసంద్రంలో అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

image

కాకినాడ జిల్లా ఏటమొగకు చెందిన 9 మంది మత్స్యకారులు ఈ నెల 24న చేపల వేటకు శ్రీదుర్గాభవాని బోటులో బయలుదేరారు. శుక్రవారం విశాఖతీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ నౌక (వీర) వెంటనే అక్కడికి చేరుకొని మత్స్యకారులను రక్షించింది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ధర్మారావు, సత్తిబాబుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Similar News

News April 20, 2025

రాజమండ్రి: మాజీ ఎంపీపై మూడో కేసు నమోదు

image

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్‌పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.

News April 20, 2025

రాజమండ్రి: మాజీ ఎంపీ పై మూడవ కేసు నమోదు

image

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడంపై కేసు నమోదు పోలీసులు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్ పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.

News April 19, 2025

రాజమండ్రి: చంద్రబాబు రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

image

సీఎం చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు సీఎంగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అన్నారు. కీ.శే. ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు.

error: Content is protected !!