News April 24, 2024

కాకినాడ: మహిళను ఢీకొట్టిన కాలేజ్ బస్సు.. మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్‌లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్‌లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 21, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ 

image

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్ అలాగే డివిజన్, మునిసిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు ప్రజల నుంచి పిజిఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు

News April 20, 2025

రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల 

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.

News April 20, 2025

రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

image

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్‌కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

error: Content is protected !!