News March 21, 2025
కాకినాడ-లింగంపల్లి మధ్య రెండు స్పెషల్ రైళ్లు

కాకినాడ- లింగంపల్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి కాకినాడకు ఏప్రిల్ 3 నుంచి జులై 1వరకు మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News April 1, 2025
WAQF BILL: నేడు బీఏసీ మీటింగ్!

వక్ఫ్ సవరణ బిల్లును ఈ వారంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) నేడు సమావేశం కానున్నట్లు తెలిసింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు, చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేయనుంది. కాగా బిల్లుపై వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. వక్ఫ్ లా అనేది స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉందని, దానిని సవరించడం చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
News April 1, 2025
ప్రకాశం: నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభం కావలసిన ఇంటర్ తరగతులు ఈ ఏడాది 2 నెలల ముందే ప్రారంభమయ్యాయి.
News April 1, 2025
తాడేపల్లిగూడెంలో ఫోక్సో కేసు నమోదు

తాడేపల్లిగూడెంలోని కడగట్లకు చెందిన నాగరాజుపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు సోమవారం నమోదయింది. సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. 2 రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి యత్నిస్తుండగా మేనమామ చూసి కేకలు వేగా నాగరాజు పరారయ్యాడన్నారు. మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.