News April 8, 2025

కాకినాడ: వీడు మామూలోడు కాదు..!

image

బిక్కవోలు జగనన్న కాలనీలో నిన్న ఓ యువకుడు గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన సూర్యప్రకాశ్ 10వ తరగతి వరకు చదివాడు. కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ బైక్‌లు దొంగలిస్తున్నాడు. మరోవైపు గంజాయి వ్యాపారానికి తెరలేపాడు. దొంగతనం చేసిన బైకును కె.పెదబయలుకు చెందిన పంతులబాబు అనే వ్యక్తికి ఇచ్చి గంజాయి తీసుకుని బిక్కవోలుకు రాగా పోలీసులకు దొరికాడు.

Similar News

News April 19, 2025

RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

image

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.

News April 19, 2025

ఒడిశా టిన్ బీర్లతో కాకినాడ వ్యక్తి అరెస్ట్

image

విశాఖ జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గురువారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు మునగపాక ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. స్థానిక జంక్షన్‌లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కాకినాడకు చెందిన వ్యక్తి అక్రమ మద్యం కారులో ఒడిశాకు తరలిస్తుండగా సుమారు 105 టిన్‌ల బీర్లు లభ్యమయ్యాయి. కారు సీజ్ చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2025

ADB: మహిళ కడుపులో 3.5కిలోల గడ్డ.. అరుదైన చికిత్స

image

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి ఓ మహిళ కడుపులో నుంచి ముడున్నర కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను వైద్యులు తొలగించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మహిళ కుటుంబీకులు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.

error: Content is protected !!