News February 13, 2025

కాగజ్‌నగర్: యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్ట్: CI

image

కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకా నగర్‌కు చెందిన అక్రంపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ విచారణ చేపట్టారు. పట్టణంలోని తైబానగర్ కాలనీకి చెందిన ఫారూక్, రాజిక్, సాదిక్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.. అనంతరం వీరిని సిర్పూర్ JFCM కోర్టులో రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 13, 2025

నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

News February 13, 2025

మెదక్: లేగ దూడపై చిరుత దాడి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో చిరుత పులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దాసరి పెద్ద ఎల్లయ్య వ్యవసాయ పొలం వద్ద పశువులపాకపై చిరుత పులి దాడి చేసి ఒక లేగ దూడను చంపేసింది. ఉదయం పశువుల పాకకు వెళ్లిన రైతు లేగ దూడపై చిరుత దాడిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరారు.

News February 13, 2025

రంగరాజన్‌పై దాడి.. కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు

image

TG: రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి పోలీసుల కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘10 నెలల క్రితమే రంగరాజన్‌ను రామరాజ్యం రాఘవరెడ్డి కలిసి తమ సంస్థకు మద్దతు తెలపాలని కోరారు. తమకు రిక్రూట్మెంట్ చేయడంతో పాటు ఆర్థిక సాయం చేయాలన్నాడు. రాఘవరెడ్డి ప్రతిపాదనను రంగరాజన్ ఒప్పుకోలేదు. ఈ అక్కసుతోనే దాడికి ప్లాన్ చేసిన రాఘవరెడ్డి 22 మందితో చిలుకూరు వెళ్లాడు’ అని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

error: Content is protected !!