News February 8, 2025

కాగజ్‌ననగర్: పట్టభద్రులు భాజపా అభ్యర్థిని పట్టం కట్టండి: ఎమ్మెల్యే 

image

కరీంనగర్‌లోని కలెక్టరేట్ భవనంలో బీజేపీ ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజి రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. శాసనమండలి బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డిని గెలిపించాలని కోరారు. వీరితో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఉన్నారు. 

Similar News

News February 8, 2025

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

image

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

News February 8, 2025

ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP

image

ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

News February 8, 2025

క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ 

image

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.

error: Content is protected !!