News April 8, 2025
కాగుపాడు సర్పంచ్ సస్పెన్షన్

ఉంగుటూరు మండలం కాగుపాడు సర్పంచ్ కడియాల సుదేష్ణను విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉప సర్పంచ్ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
ప.గో: జేసీ హెచ్చరికలు

షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
News April 18, 2025
భీమవరం: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి గల వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు వారి దరఖాస్తులను 85000 64372కు అందజేయాలన్నారు.
News April 18, 2025
మచిలీపట్నం: వాటర్ ట్యాంకర్ ఢీకొని వృద్ధుడి మృతి

మచిలీపట్నం డీమార్ట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్డే పెంటయ్య (78) మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా వాదాలగూడెంకి చెందిన పెంటయ్య మాచవరంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంటికి వచ్చాడు. బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పెంటయ్యను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.