News March 19, 2024
కాటారం: బయ్యారం X రోడ్డు వద్ద ACCIDENT

కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి అక్షయ అనే విద్యార్థిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. మంగళవారం పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అన్న రాజేష్, తమ్ముడు తరుణ్‌తో కలిసి కాటారం వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి బయ్యారం క్రాస్ సమీపంలో ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది .అక్షయ ఒక తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
Similar News
News April 21, 2025
కరీంనగర్: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.
News April 20, 2025
సీఎం విదేశీ పర్యటనపై బండి సంజయ్ ఫైర్

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో పర్యటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు కలసి బహిరంగ సభలు పెట్టి ముస్లిం ఓట్ల కోసం డ్రామాలు ఆడుతన్నాయని ద్వజమెత్తారు.