News February 16, 2025
కాటారం సబ్ డివిజన్ అడవుల్లో పెద్దపులి!

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్‌లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News March 14, 2025
ALERT: KNR జిల్లాలో 40°C ఉష్ణోగ్రతలు

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి, కొత్తపల్లి-ధర్మారం, గంగాధర, నుస్తులాపూర్, ఇందుర్తి 40.0°C నమోదు కాగా, జమ్మికుంట, మల్యాల 39.9, దుర్శేడ్ 39.6, వీణవంక, KNR 39.5, చిగురుమామిడి 39.4, కొత్తగట్టు, తాడికల్, గుండి 39.3, ఖాసీంపేట 39.1, రేణికుంట 39.0, తాంగుల 38.9, వెంకేపల్లి 38.8, చింతకుంట, బురుగుపల్లి 38.5, గట్టుదుద్దెనపల్లె 38.4°C గా నమోదైంది.
News March 14, 2025
కరీంనగర్: ప్రతి భవిత విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలి: కలెక్టర్

భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భవిత కేంద్రాలలో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్‌తో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులకు మంజూరు చేసే యుడిఐడి కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
News March 14, 2025
కరీంనగర్: ఈవీఎం గోదాంను పరిశీలించిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌లను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాడ్ గోడౌన్‌లను తనిఖీ చేస్తున్నామని, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి గోడౌన్ తనిఖీ చేశారు.