News December 29, 2024
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఎస్పీ కీలక సూచన
పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అభ్యర్థులకు సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు APSLPRB ఆధ్వర్యంలో APSP బెటాలియన్‌లో PMT/PET పరీక్షలు నిర్వహించనున్నారు.
Similar News
News January 2, 2025
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం: కలెక్టర్
2025 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య, డీఆర్‌వో సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది గురువారం కలెక్టర్‌ను కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
News January 2, 2025
KNL: విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు.. YCP ఫైర్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గురుకులంలో ఓ విద్యార్థినిపై లైబ్రేరియన్ <<15043665>>లైంగిక<<>> వేధింపులకు పాల్పడిన ఘటన నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వ చేతగానితనంతో ఏపీలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని ఆరోపించింది. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారా? అంటూ సీఎం CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను ప్రశ్నించింది.
News January 2, 2025
4 నెలలే దర్శనం.. ఈ ఆలయ చరిత్ర ఘనం!
సంగమేశ్వర దేవాలయం కర్నూలు <<15042913>>జిల్లాలో<<>> ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఈ ఆలయం ఉంది. ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉండగా ఎందరో మునుల తపస్సుకు ఈ ప్రాంతం ఆశ్రయమిచ్చింది.