News December 30, 2024

కాపు రామచంద్రారెడ్డి పార్టీ మారనున్నారా?

image

అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చినా తనకు అంత ప్రాధాన్యం లేదని భావిస్తున్న ఆయన తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని నెట్టింట జోరు ప్రచారం సాగుతోంది. అయితే దీనిని ఆయన అనుచరులు ఖండిస్తున్నారు.

Similar News

News January 5, 2025

లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై కలెక్టర్ సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు పరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పక్కాగా అమలు కావాలన్నారు.

News January 4, 2025

ఈనెల 6 నుంచి దివ్యాంగుల పింఛన్ల సామాజిక తనిఖీ

image

అనంతపురం జిల్లాలో ఈ నెల 6 నుంచి ఎన్టీఆర్ దివ్యాంగుల పింఛన్లు సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక కార్యక్రమంలో తెలిపారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10 వరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తనిఖీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.

News January 4, 2025

సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దాం: కలెక్టర్

image

సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ హోదాలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏయే శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.