News December 20, 2024

కాఫీ తోటల నిర్వహణకు డిప్లొమా కోర్సు 

image

కాఫీ బోర్డ్ 2025-26 సంవత్సరానికి డిప్లొమా ఇన్ కాఫీ ఫార్మ్ మేనేజ్మెంట్, సర్టిఫికేట్ కోర్స్ ఆన్ కాఫీ ఫార్మ్ సూపర్వైజర్ కోర్సులకు ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మినుములూరు కాఫీ బోర్డు SLO రమేశ్ తెలిపారు. డిప్లొమా కోర్స్‌కు ఇంటర్, సర్టిఫికేట్ కోర్సుకు 8వ తరగతి అర్హత ఉండాలన్నారు. SC, ST వారికి ఫీజులో 50% రాయితీ ఉంటుందని, వివరాలకు https://coffeeboard.gov.in/ని సందర్శించాలన్నారు. >Share it

Similar News

News February 5, 2025

పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు

image

రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.

News February 5, 2025

విశాఖ: ఎమ్మెల్సీ‌ బరిలో స్వతంత్ర అభ్యర్థి 

image

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఆనందపురం ఎంఈవోగా పదవీ విరమణ చేసిన ఎస్.ఎస్.పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ యూనియన్‌లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

News February 5, 2025

గంటల వ్యవధిలో యువతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

image

ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు ఒక యువతి తప్పిపోయినట్లు మంగళవారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించి టెక్ సెల్, సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సదరు యువతిని పీఎం పాలెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంటల వ్యవధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ కనుగొన్న ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.

error: Content is protected !!