News January 21, 2025

కాబోయే సీఎం లోకేశ్.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం

image

మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం కూటమిలో దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో మంత్రి TG <<15206909>>భరత్<<>> మరో అడుగు ముందుకేసి ‘ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్‌లో కాబోయే సీఎం లోకేశ్’ అంటూ జ్యూరిచ్‌లో సీఎం చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టారు. ఈ అంశం మరింత చర్చకు తావిచ్చింది. మరి మంత్రి భరత్ వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.

Similar News

News January 21, 2025

ఇద్దరు ఐపీఎస్‌ల ప్రేమ వివాహం.. కర్నూలులో పోస్టింగ్..!

image

ఐపీఎస్ భార్యాభర్తలిద్దరూ కర్నూలులో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆయన సతీమణి దీపికను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక ఉన్నారు. కాగా, తన అన్న స్నేహితుడైన విక్రాంత్ పాటిల్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.

News January 21, 2025

కర్నూలు జిల్లా కొత్త ఎస్పీ నేపథ్యం ఇదే!

image

కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా <<15208705>>ఐపీఎస్<<>> అధికారి విక్రాంత్ పాటిల్ నియమితులైన విషయం తెలిసిందే. విక్రాంత్ గతంలో చిత్తూరు జిల్లా ఎస్పీ, విజయవాడ డీసీపీ, చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్‌, మన్యం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్నారు. ఆయన సతీమణి దీపికా పాటిల్ కూడా ఐపీఎస్ అధికారే. గతంలో కర్నూలు ఏఎస్పీగా సేవలందించారు.

News January 21, 2025

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి: నంద్యాల కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అధికారి తన లాగిన్‌లో ఉన్న అర్జీలను అదే రోజు చూసి యాక్సెప్ట్ చేయడం లేదా సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.