News February 25, 2025
కామారెడ్డి: 100% ఉత్తీర్ణత సాధించాలనేదే లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ రివ్యూ సమావేశంలో మాట్లాడారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఫలితాలు మెరుగుపరచాలన్నారు. విద్యార్థులను విభాగాలుగా విభజించి, దత్తత తీసుకుని ఫలితాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు.
Similar News
News February 25, 2025
మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్‌లో హరిపురం యువకుడి సత్తా

మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్‌లో మందస మండలం హరిపురం యువకుడు కొండ అవినాశ్ సత్తా చాటి అందరి దృష్టి ఆకర్షించాడు. హరిపురంలోని ఏవన్ ఫిట్నెస్ జిమ్ తరుఫున కొండ అవినాశ్ ఇటీవల ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నాడు. 27 ఏళ్ల యువకుడు అవినాశ్ బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు.
News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
News February 25, 2025
HYD: పబ్‌లో యువతిపై ఎక్స్ లవర్ దాడి

జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.