News January 26, 2025
కామారెడ్డి: 615 ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాం: కలెక్టర్

4 పథకాల ప్రారంభోత్సవంపై సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 535 గ్రామ, 80 వార్డు ప్రజాపాలన సభలు నిర్వహించినట్లు తెలిపారు. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు..
Similar News
News March 14, 2025
NZB: హోలీ ప్రత్యేకం.. పూర్ణం భక్ష్యాలు, నేతి బొబ్బట్లు

నిజామాబాద్ జిల్లా కేంద్రం సకల సంప్రదాయాలకు నిలయం. మహారాష్ట్ర సంప్రదాయం అధికం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. ఈ వేళ విందు భోజనంలో నేతి బొబ్బట్లు, కోవా, కొబ్బరి, పూర్ణం భక్ష్యాలను చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి స్థిర నివాసం చేసుకుంటుందని భక్తుల విశ్వాసం.
News March 14, 2025
MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.
News March 14, 2025
పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.